1999వ సంవత్సరం తొలి ఏకాదశి పర్వదినాన అహోరాత్ర జపయజ్ఞంతో విడివడి, ఆ ఉద్యమం తన అవిచ్ఛిన్నతను కాపాడుకొంటూ అహోరాత్ర జపయజ్ఞాలుగా నిర్వహింపబడుతూ వస్తున్నది. అనతికాలంలో ఎంతో దృఢసంకల్పంతో చేసిన ప్రయత్నం శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మానందతీర్థ యతీశ్వరులవారి ఆశీస్సులతో, శ్రీకృష్ణస్వామి కృపతో ఫలించి ఒక దివ్యక్షేత్రం ఆవిర్భావమై, శ్రీ స్వామివారు అప్పటిలో ప్రసాదించిన భవ్యనామం “శ్రీ విష్ణుసహస్రనామ క్షేత్రం” కేంద్రంగా ఆ ఉద్యమం అలరారుతున్నది.
పై మందిరంలో ప్రతిరోజూ 12 ఆవృత్తులుగా (12 మార్లు) శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము జరుగుతుంది.
ఉత్సవాలు
విశేష కార్యక్రమాలు
శుక్ల, బహుళ పక్షాలలో పారాయణ
ప్రతి నెలా శుక్ల, బహుళ ఏకాదశి నాడు
ఏకాదశి రోజు ఉ.4.00 గం.లకు శ్రీవిఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనముతో ప్రారంభమై, ఉ.6.00 గం.ల నుండి 8 యామాలుగా (ప్రతి యామం 3 గంటలు, 12 పారాయణలు) తెంపు లేకుండా ద్వాదశి ఉదయం 6.00 గం.ల వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర అహోరాత్ర పారాయణ సాగుతుంది.
మాఘ మాసంలో సప్తాహం
ప్రతి సంవత్సరం మాఘ మాసంలో
అహోరాత్ర జపయజ్ఞమువలె యామ విభాగాలతో సాగే ఏడు రోజుల మహా జపయజ్ఞం. పరమేశ్వరునికి లక్ష శివనామ బిల్వార్చన, మహావిష్ణువుకు లక్ష విష్ణునామ తులసి బిల్వార్చన జరిగి, పూర్ణాహుతితో సప్తాహం ముగుస్తుంది.
పుణ్యక్షేత్రాలలో పారాయణ
ప్రతి ఆరు నెలలకోమారు
ప్రతి ఆరు నెలలకోమారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అక్కడి వసతి సదుపాయాలను బట్టి అహోరాత్రం, త్రయాహ్నికం లేదా సప్తాహోరాత్రం నిర్వహించబడుతాయి.
శ్రీ శంకర జయంతి
ప్రతి సంవత్సరం శ్రీ శంకర జయంతికి
ప్రతి సంవత్సరం శ్రీ శంకర జయంతికి అహోరాత్ర / ద్వాదశావృత్తి పారాయణ నిర్వహించబడుతుంది.
శ్రీ నృసింహ జయంతి
ప్రతి సంవత్సరం శ్రీ నృసింహ జయంతికి
ప్రతి సంవత్సరం శ్రీ నృసింహ జయంతికి అహోరాత్ర / ద్వాదశావృత్తి పారాయణ నిర్వహించబడుతుంది.
శ్రీకృష్ణ జన్మాష్టమి
ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమికి
ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమికి అహోరాత్ర / ద్వాదశావృత్తి పారాయణ నిర్వహించబడుతుంది.
మీ భక్తి సేవగా మారనివ్వండి
క్షేత్ర ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలకు మీ సహకారం ధన, వస్తు రూపేణ అందించండి. చెల్లింపు వివరాలు త్వరలో ఇక్కడ అందుబాటులోకి వస్తాయి.